భార్యపై కోపం.. ఎనిమిది నెలల బిడ్డను రెండో అంతస్థు నుంచి కింద పారేశాడు..

సోమవారం, 31 డిశెంబరు 2018 (11:57 IST)
ఆధునికత ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే ఆవేశానికి గురై, నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా ఓ ప్రబుద్ధుడు భార్యతో గొడవపడి.. కన్నబిడ్డను రెండో అంతస్తు నుంచి విసిరేశాడు. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన మనోజ్, జహ్నవి దంపతులు నగరంలోని నాచారం మల్లాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్న మనోజ్ భార్యతో తరచూ గొడవకు దిగేవాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం ఫూటుగా మందుతాగి ఇంటికొచ్చిన మనోజ్ భార్యతో గొడవకు దిగాడు. వీరిద్దరి గొడవ ముదరడంతో 8 నెలల చిన్నారిని ఆగ్రహంతో మనోజ్.. రెండో అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. వెంటనే స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వివస్త్రను చేసి.. రోడ్డుపై పరుగులు పెట్టించాడు.. వీడియోలు తీసిన పోలీసులు