Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదిలాబాద్‌ జిల్లాలో గడువు తీరిన మందులు

Advertiesment
Expired drugs
ఆదిలాబాద్‌ రిమ్స్‌లో రోగులకు గడువు తీరిన మందులు, ఇంజక్షన్‌ వేయడంపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌కు ఆసుపత్రిలో ఎక్స్‌పైర్‌ అయిన మందులు ఇచ్చిన విషయంపై వివరించారు.

దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా రిమ్స్‌ ఆసుపత్రిలో సేవలు మెరుగు పరిచేందుకు డాక్టర్లు, అధికారులు మరింత బాధ్యతగా పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో సొసైటీ మాజీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు సాయిచరణ్‌గౌడ్‌ తదితరులున్నారు.
 
కేసు నమోదు చేయాలి..
రిమ్స్‌లో రోగులకు గడువు తీరిన మందులు, ఇంజక్షన్‌ వేయడంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు.

రిమ్స్‌లో ఆదివారం రాత్రి పేషెంట్లకు గడువు తీరిన ఇంజక్షన్లను ఇవ్వడంపైనే కాకుండా రిమ్స్‌లో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టాలని బీజేపీ నాయకురాలు సుహాసినిరెడ్డి కలెక్టర్‌ను కలిసి కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్రివేండ్రం-గువహటి మధ్య ప్రత్యేక రైళ్లు