Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

క్రీడా పాలసీ కోసం సబ్ కమిటీ ఏర్పాటు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Advertiesment
Sub-Committee
, శనివారం, 29 ఆగస్టు 2020 (15:59 IST)
రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా పాలసీ కోసం సబ్ కమిటీ వేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం హాకీ స్టేడియంలో నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు.
 
క్రీడాకారులందరికీ జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు. ద్యాన్ చంద్ మామూలు స్థాయి నుంచి ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. సామాన్యుడు పట్టుదలతో ఏదైనా సాధిస్తాడు అనడానికి ఉదాహరణ ద్యాన్ చంద్. ద్యాన్ చంద్ చరిత్రను ప్రతి క్రీడాకారుడు తెలుసుకునేందుకు ఆయన పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించారు.
 
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు వ్యాయామం అవసరం. తెలంగాణలో క్రీడలకు పెద్దపీట వేశాం. రాష్ట్రంలో ఇప్పటికే 14 స్టేడియాలను పూర్తి చేశాం. మరో 50 స్టేడియాలను నిర్మించాలని నిర్ణయించాం. ఉద్యోగాలలో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పించాము. క్రీడా పాలసీ కోసం ముఖ్యమంత్రి సబ్ కమిటీ వేశారు. దేశంలో లేని క్రీడా పాలసీని తీసుకువస్తాం. క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే దేశానికి గొప్ప పేరు వస్తుంది. ప్రతి వ్యక్తి ద్యాన్ చంద్‌ను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుభాషా దినోత్సవం.. గిడుగును గుర్తు చేసుకున్న పవన్.. మాతృభాషను చిన్నారులకు..?