Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖమ్మం జిల్లా మణుగూరులో కంపించిన భూమి.. ప్రాణభయంతో ప్రజలు పరుగోపరుగు

earthquake
, శుక్రవారం, 25 ఆగస్టు 2023 (10:53 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మణుగూరులో శుక్రవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. తెల్లవారుజామున 4.43 గంటల సమయంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. వీటి ప్రభావం కారణంగా భవంతులు సైతం ఊగిపోయాయి. దీంతో మంచి నిద్రలో ఉన్న స్థానికులు ప్రాణభయంతో అక్కడ నుంచి పారిపోయారు. అయితే, ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణనష్టం సంభవించలేదు. ఏది ఏమైనా అధికారులు మాత్రం వివరాలను ఆరా తీస్తున్నారు. కాగా, గత శనివారం సాయంత్రం కూడా మణుగూరు మండలంలో ఇదే విధంగా భూప్రకంపనలు సంభవించాయి. రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రకంపనలు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
 
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్  
 
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఈ యేడాది ఆఖరులో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులోభాగంగా, రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఉపాధ్యాయ నియామక టెస్ట్ (టీఆర్టీ) ద్వారా ఏకంగా 5089 సాధారణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాల్సిందిగా ఆదేశించింది. వీటితో పాటు ప్రత్యేక అవసరా పిల్లలకు సంబంధించి 1523 టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. మొత్తం మీద ఎన్నికల వేళ ఏకంగా 6612 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు.
 
ఇదే విషయంపై ఆ రాష్ట్ర విద్యా శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ, ఉపాధ్యాయ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీలు (డీఎస్సీ) నియామకాలు చేపడతాయన్నారు. ఈ ప్రకారం టెట్ క్వాలిఫై అయిన వారంతా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులని చెప్పారు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొంచి డీఎస్సీకి పంపుతారని, అనంతరం ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతారని తెలిపారు. 
 
'ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సెప్టెంబరు 15న నిర్వహిస్తాం. అదే నెల 27న ఫలితాల వెల్లడి ఉంటుంది. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ జారీ అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 ఉండగా... ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. ప్రత్యక్ష నియామకాల ద్వారా 6,612 కాకుండా పదోన్నతుల ద్వారా 1,947 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 2,162 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (పీఎస్ హెచ్ఎం), 5,870 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను (మొత్తం 9,979) భర్తీ చేస్తామని ఆమె తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యతో గొడవ... కౌన్సెలింగ్‌కు పిలిచిన పోలీసులు.. భయపడి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ