భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో 50 ఏళ్ల మహిళ రోగికి వైద్యులు 12 కిలోల బరువున్న కాలేయాన్ని తొలగించి మూత్రపిండాల మార్పిడి చేశారు.
ముగ్గురు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌లు, కిడ్నీ మార్పిడి సర్జన్‌తో సహా పేరెన్నికగన్న సర్జన్ల బృందం ఏకకాలంలో కాలేయం, మూత్రపిండాల మార్పిడిని నిర్వహించింది. నవంబర్ మొదటి వారంలో శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి గురువారం ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన ఉషా అగర్వాల్ అనే మహిళను వైద్యులు కాపాడారు. ఆ మహిళ కాలేయం చాలా పెద్దదిగా వుండటంతో అది ప్రేగులను స్థానభ్రంశం చేస్తూ ఆమె పొత్తికడుపు మొత్తాన్ని ఆక్రమించింది.
సాధారణ ఆరోగ్యకరమైన పరిస్థితులలో, కాలేయం గరిష్టంగా 1.5 కిలోల బరువు ఉంటుంది. కానీ ఆమె కాలేయం భారీ సైజులో వుండటంతో ఆమె నానా తంటాలు పడింది. దీంతో ఆమె కాలేయాన్ని, కిడ్నీని ఒకేసారి మార్పిడి చేసినట్లు వైద్యులు చెప్పారు.