Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

40 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ

Advertiesment
Distribution
, గురువారం, 12 మార్చి 2020 (06:42 IST)
పేద ప్రజలు వైద్యంపై చేసే ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల రాజేందర్​ శాసనమండలిలో అన్నారు. కంటివెలుగు పథకం ద్వారా 40 లక్షల మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేశామని మంత్రి స్పష్టం చేశారు.

కంటి వెలుగు పథకం ద్వారా 40 లక్షల మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేశామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనమండలిలో ​తెలిపారు. ఇవాళ మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే అన్ని రకాల చికిత్సలు జరగాలనేది తమ సిద్ధాంతమని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 40 ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో ఆస్పత్రిలో దాదాపు 5 డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదలు వైద్యంపై చేసే ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు పోషకాహారం అందిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్​ మండలిలో స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫాస్ట్ ట్రాక్ విధానంలో కుల ధ్రువీకరణ పత్రాలు: ఎన్నికల కమీషనర్