రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు రోడ్డుపై దస్తావేజు లేఖర్లు, రియల్టర్లు తదితరులు పెద్దఎత్తున బైఠాయించారు.
సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి, ఎల్ ఆర్ ఎస్ వద్దంటు డిమాండ్ చేశారు. కెసిఆర్ ఆర్ తుగ్లక్ పాలన తమకు వద్దంటూ విమర్శలు చేశారు. కుటుంబ పాలనతో కన్నూ మిన్నూ కానకుండా కెసిఆర్ ప్రజా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ప్రజా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ప్రజల సంక్షేమానికి పాటుపడాల్సిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. మళ్లీ పాత పద్ధతులనే కొనసాగించక పోతే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు.
వద్దురా నాయన కెసిఆర్ పాలన అంటూ నినాదాలు చేస్తున్నారు. రోడ్డును దిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు వెంకటయ్య, వహాబ్ తదితరులు పాల్గొన్నారు.