తెలంగాణ హైకోర్టులో కోవిడ్ అన్‌లాక్ ప్రక్రియ మొదలుపెట్టాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోర్డు సిబ్బంది మొత్తం విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతున్నారు. ఈనెల 19 నుంచి న్యాయస్థానాల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది.
ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా తెలంగాణా రాష్ట్రంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు, హైకోర్టులో ఈనెల 31 వరకు ఆన్‌లైన్ విధానమే కొనసాగనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.