Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం స్పెషల్ ట్రైనింగ్...

కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం స్పెషల్ ట్రైనింగ్...
, బుధవారం, 16 డిశెంబరు 2020 (08:31 IST)
ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు ఫార్మా కంపెనీలు టీకాలను అభివృద్ధి చేశాయి. ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ టీకాల పంపిణీ ఈ నెల 25వ తేదీ నుంచి మన దేశంలో పంపణీ చేయనున్నారు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా వ్యాక్సినేషన్ కోసం అనేక రకాలైన చర్యలు చేపట్టింది. 
 
ఇందులోభాగంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కరోనా టీకా అందుబాటులోకి రాగానే దానిని త్వరితగతిన పంపిణీ చేసేందుకు సమాయత్తమైంది. ఇందుకోసం 50 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. 
 
రాష్ట్రస్థాయిలో ఇప్పటికే శిక్షణ కార్యక్రమం పూర్తికాగా, ఇప్పుడు జిల్లాల్లోనూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రానున్న పదిరోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనూ వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోఠి ఆరోగ్య కార్యాలయంలో శిక్షణ కొనసాగుతోంది.
 
టీకా రాష్ట్రానికి చేరుకున్న వెంటనే తొలుత ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి ఇస్తారు. వీరందరికీ ఒకేసారి టీకా ఇవ్వనున్నారు. తొలి విడతలో దాదాపు 75 లక్షల మందికి టీకా ఇవ్వనుండగా, వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది దాదాపు 3 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. 
 
మరో రెండు లక్షల మంది పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రవాణా సిబ్బంది ఉంటారు. మిగతా వారంతా 50 ఏళ్ల వయసు పైబడినవారేనని తెలుస్తోంది. అలాగే, 50 ఏళ్ల లోపు వయసు ఉండి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా టీకా ఇవ్వనున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 వేల బృందాలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఒక్కో బృందం ఒక్కో కేంద్రంలో టీకాలు వేస్తుంది. ఇందుకోసం పదివేల మంది ఏఎన్ఎంలు, 25 వేల మంది ఆశా కార్యకర్తలు,15 వేల మంది వైద్యులు, నర్సులకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, రాష్ట్ర స్థాయిలో రెండు కోట్లు, జిల్లా స్థాయిలో కోటి టీకాలను ఒకేసారి భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లీజ్... మూడు రాజధానులకు మద్దతివ్వండి : షా వద్ద సీఎం జగన్ మొర