జూబ్లీహిల్స్‌లో కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక శని, ఆదివారాలు అయితే భక్తుల రద్దీ ఇక చెప్పనక్కరలేదు. అయితే శ్రావణ మాసం మూలంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున వరుస కడుతున్నారు.
అయితే కరోనావైరస్ మూలంగా భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా భౌతిక దూరం పాటించేలా
సర్కిల్స్ వేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే ఎంతచెప్పినా కూడా భక్తులు నిబంధనలు పట్టించుకోకపోవడంతో కొత్త ప్రయోగం చేపట్టారు ఆలయ నిర్వాహకులు.
భక్తులు సామాజికదూరం పాటించేలా గొడుగులు ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చిన భక్తులకు ఒక్కొక్కరికి ఒక్కో గొడుగు ఇస్తున్నారు. దర్శనం పూర్తయ్యే వరకు భక్తులు గొడుగు పట్టుకునే ఉండాలి. అమ్మవారు దర్శనం పూర్తయ్యాక బయటకు వచ్చిన తరువాత మాత్రమే ఆ గొడుగు ఆలయ సిబ్బందికి తిరిగి ఇవ్వాలి.
ఈ గొడుగులు ప్రయోగం చాలా బాగుందని, దీనివల్ల లోపలికి వచ్చిన భక్తులు కచ్చితంగా భౌతికదూరం పాటిస్తున్నారు అని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.