Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ఆర్టీసీలో కార్గో సేవలు

Advertiesment
తెలంగాణ ఆర్టీసీలో కార్గో సేవలు
, బుధవారం, 11 డిశెంబరు 2019 (06:30 IST)
ఆర్టీసీలో కార్గో సేవలు పెంచాలన్న సీఎం కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కార్గో సేవలపై ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ మంగళవారం సమీక్షించారు. కార్గో సేవలను ప్రారంభించడంపై సుదీర్ఘంగా చర్చించారు.

ఓ ప్రైవేటు  సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రస్తుతం ఆర్టీసీ పార్శిల్‌ సేవలను అందిస్తోంది. ఈ సేవలు కూడా పూర్తిస్థాయిలో కొనసాగడంలేదు. అందుకే, వివిధ ప్రభుత్వ శాఖలతో ఒప్పందాలు చేసుకుని భారీగా కార్గో సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందు కోసం ఆర్టీసీ బస్సులను వినియోగించనున్నారు. ఇటీవల అద్దె బస్సుల కోసం పిలిచిన టెండర్లలో 1334 బస్సులను ఫైనల్‌ చేశారు.

ఈ అద్దె బస్సు లు వస్తే.. ఆర్టీసీలోని పాత బస్సులను పక్కన పెట్టాలని నిర్ణయించారు. ఈ పాత బస్సులనే కార్గో సేవలకు వినియోగించనున్నారు. మొత్తం 1334 పాత బస్సుల ద్వారా ఈ సేవలను అందిస్తారు. వీటిని డీజీటీ(డిపో గూడ్స్‌ ట్రావెల్‌) బస్సులుగా మారుస్తారు. ముఖ్యంగా ధాన్యం, ఇతర సామగ్రిని తరలించడానికి వీలుగా మార్పులు చేయాలని నిర్ణయించారు. కార్గో సేవల ఆర్డర్ల కోసం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపనున్నారు.

ముఖ్యంగా వ్యవసాయం, పౌర సరఫరాలు, విద్య, సాంఘిక సంక్షేమం, వైద్యం తదితర శాఖలతో ఒప్పందాలు చేసుకుని కార్గో సేవలను ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చారు. కార్గో సేవలు అవసరమయ్యే శాఖలన్నింటినీ గుర్తించి, వాటి ముఖ్యకార్యదర్శులతో భేటీ కానున్నారు. ఈ బాధ్యతలను ఈడీలకు అప్పగించారు.

త్వరలో సునీల్‌ శర్మ సహా మిగతా ఈడీలందరూ ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులతో భేటీ అయి ఒక అవగాహనకు వస్తారు. ఏ శాఖకు ఎలాంటి పని అవసరమైనా... తమ బస్సుల ద్వారా తరలించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆయా శాఖలకు వివరించనున్నారు. ఇందుకోసం కనీస రేట్లను నిర్ణయించి ఒప్పందాలు చేసుకోనున్నా రు.

ఈ ఒప్పందాలన్నీ కొలిక్కి వచ్చాక... బస్సులను డీజీటీలుగా మార్చే పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తు తం టికెట్‌ అమ్మకాల ద్వారా రోజుకు రూ.11 కోట్ల మేర రా బడి వస్తోంది. అయినా, నష్టాలు తప్పడంలేదు. ఈ నష్టాలను కొంతమేర తగ్గించుకోవడానికి కార్గో సేవలు మేలైన మార్గంగా భావిస్తున్నారు. వీటి ద్వారా నెలకు కనీసం రూ.రెండు మూడు కోట్లు వచ్చినా ఉపశమనంగా ఉంటుందని అనుకుంటున్నారు.

సాధ్యమైనంత త్వరగా ఈ సేవలను అందుబాటులోకి తేవాలని, వెంటనే వివిధ శాఖలతో స మావేశాలు నిర్వహించడానికి ప్రణాళిక ను రూపొందించుకోవాలని సునీల్‌ శర్మ ఈడీలను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో వేటిని అమలు చేశారంటూ శర్మ ఆరా తీశారు. 359 మంది కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయడం, 33 మంది మృతుల కుటుంబాల్లోని సభ్యులకు ఉద్యోగాలివ్వడం, మహిళా సిబ్బందికి రాత్రి 8 గంటల వరకే విధులు ఇవ్వడం వంటి నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తున్నామని అధికారులు వివరించారు.

మహిళా సిబ్బంది కోసం చేంజ్‌ ఓవర్‌ పాయింట్ల వద్ద టా యిలెట్లు, దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో వీటిని అమలు చేస్తున్నామని తెలిపారు. ఎర్రమంజిల్‌లోని రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఈడీలు టీవీ రావు, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్‌, యాదగిరి పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులకు ఆధార్‌ ఉంటేనే పీఎం-కిసాన్‌