Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగ్గారెడ్డి అరెస్ట్... గుజరాత్‌లోని వ్యక్తులు మీ భార్య కుటుంబ సభ్యులెలా? పోలీస్ ప్రశ్న

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. 2004లో నకిలీ పత్రాలతో గుజరాత్‌కి చెందిన ముగ్గురుని తన భార్య కుటుంబ సభ్యులుగా చూపి అమెరికాకు తరలించినట్లు ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో

జగ్గారెడ్డి అరెస్ట్... గుజరాత్‌లోని వ్యక్తులు మీ భార్య కుటుంబ సభ్యులెలా? పోలీస్ ప్రశ్న
, మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (09:49 IST)
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. 2004లో నకిలీ పత్రాలతో గుజరాత్‌కి చెందిన ముగ్గురుని తన భార్య కుటుంబ సభ్యులుగా చూపి అమెరికాకు తరలించినట్లు ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో సమారు 3 గంటలు పాటు జగ్గారెడ్డిని విచారించారు పోలీసులు. జగ్గారెడ్డి 2004 ప్రభుత్వ విప్ పదవిలో ఉండి అధికార దుర్వినియోగంకి పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు పోలీసులు. 
 
జగ్గారెడ్డి అరెస్ట్ పైన టి కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. నిన్న అర్థరాత్రి టీ పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఉన్న జగ్గారెడ్డి దగ్గరకు వెళ్లి పరామర్శించారు. ఈ నెల 12న గులాంనబీ ఆజాద్ సభకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కుట్రపూరితంగా అరెస్ట్ చేశారంటూ దీనికి నిరసనగా ఇవాళ సంగారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. 
 
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జగ్గారెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని 2004లో ఎఫ్ఐఆర్ అయిన కేసులో ఇప్పుడు అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. 2004లో కేసీఆర్, హరీష్ రావు కూడా నిందితులుగా అక్రమ ఇమ్మిగ్రేషన్ కేసులో నిందితులుగా ఉన్నారని వారిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జగ్గారెడ్డి అరెస్టుతో కాంగ్రెస్ పార్టీ నేతలో అయోమయంలో పడ్డారు. సంగారెడ్డిలో బలమైన నేతగా పేరొందిన జగ్గారెడ్డి ఇలా కేసులో ఇరుక్కోవడంతో పార్టీలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా స్నేహితులతో పడక పంచుకుంటావా? లేదా? యువతికి బెదిరింపులు