Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్.. నీకు సిగ్గుందా...? 'నీ పార్టీకి మగతనం లేదన్న దయాకర్‌ను పార్టీలోకి చేర్చుకుంటావా'?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. "నీ పార్టీకి మగతనం లేదన్న ఎమ్మెల్యే దయాకర్‌ రావును టీఆర్ఎస్ పార్టీలోకి ఎలా చేర్చుకుంటావు" అని ముఖ్యమంత్రి

Advertiesment
కేసీఆర్.. నీకు సిగ్గుందా...? 'నీ పార్టీకి మగతనం లేదన్న దయాకర్‌ను పార్టీలోకి చేర్చుకుంటావా'?
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (12:32 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. "నీ పార్టీకి మగతనం లేదన్న ఎమ్మెల్యే దయాకర్‌ రావును టీఆర్ఎస్ పార్టీలోకి ఎలా చేర్చుకుంటావు" అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణ ప్రశ్నించారు. 
 
వరంగల్‌లో జరిగిన తెరాస బహిరంగ సభలో కేసీఆర్ చేసిన స్పందిస్తూ... తెరాస సభ హీరో రజనీకాంత్ కబాలి సినిమాలా ప్లాప్ అయ్యిందన్నారు. వరంగల్ సభ రైతులను పట్టించుకోని తెరాస సభ అని, తెలంగాణ అమరవీరులను స్మరించుకోలేని సభ అని ఆయన ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడంలేదని ఆయన నిలదీశారు.
 
ప్రభుత్వం తీవ్ర అభద్రతతో ఉందని వెంకటరమణ విమర్శించారు. "కాంగ్రెస్ నేతలను చవటలు, దద్దమ్మలు అంటున్నావు. ఇచ్చిన తెలంగాణతోనే నీవు, నీ కొడుకు, బిడ్డ, అల్లుడు పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ద్రోహులకు పదవులిచ్చి మమ్మల్ని తిడుతావా" అని ఆయన కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పప్పుగారి భార్య అదరగొట్టేసింది.. ఏం స్పీచ్ గురూ.. చూసి నేర్చుకోవయ్యా....