Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పప్పుగారి భార్య అదరగొట్టేసింది.. ఏం స్పీచ్ గురూ.. చూసి నేర్చుకోవయ్యా....

సభలు, సమావేశాల్లో మాట్లాడటం ఓ కళ. వేదికపై ఎక్కగానే భయంతో కొందరు తటపటాయిస్తారు. మరికొందరు తమ వాక్చాతుర్యంతో అదరగొట్టేస్తారు. ఇటీవల డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ స్పీచ్‌పై సోష

Advertiesment
పప్పుగారి భార్య అదరగొట్టేసింది.. ఏం స్పీచ్ గురూ.. చూసి నేర్చుకోవయ్యా....
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (12:18 IST)
సభలు, సమావేశాల్లో మాట్లాడటం ఓ కళ. వేదికపై ఎక్కగానే భయంతో కొందరు తటపటాయిస్తారు. మరికొందరు తమ వాక్చాతుర్యంతో అదరగొట్టేస్తారు. ఇటీవల డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ స్పీచ్‌పై సోషల్ మీడియాలో విభిన్నాభిప్రాయాలు వచ్చాయి. విమర్శలొచ్చాయ్.

కారణం ఏంటంటే? జయంతిని వర్ధంతి అనడం.. వర్థంతికి శుభాకాంక్షలు తెలపడం.. ఆపై నవ్వడం వంటివి చేయడం ద్వారా నారా లోకేష్‌పై విమర్శలొచ్చాయి. బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్ష నేతలు ఫైర్ అయ్యారు. ఇంకా నారా లోకేష్‌ను ఏకిపారేశారు. వైకాపా నేత రోజా అయితే ఏకంగా ఒకడుగు ముందుకేసి.. నారా లోకేష్‌ను పప్పు అనేశారు. ఇంకా నారా లోకేష్‌కు మాట్లాడటం చేతకాదని ముద్రవేసేశారు. 
 
అయితే మంత్రి నారా లోకేష్ సతీమణి, బాలయ్య కుమార్తె బ్రాహ్మణి మాత్రం స్పీచ్ అదరగొట్టేసింది. హెరిటేజ్ కంపెనీని నిర్వహిస్తున్న బ్రాహ్మణి.. స్పీచ్ అదుర్స్ అనిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో హెరిటేజ్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఇకపై ఉత్తరాదిలో హెరిటేజ్ ఉత్పత్తులను విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
ఇందులో భాగంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బ్రాహ్మణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ సాధించిన ఘనతలు గురించి హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ నందమూరి బ్రాహ్మణి సంస్థ గురించి అద్భుతంగా వివరించారు.

తమ సంస్థ లక్ష్యం హెల్త్ అండ్ హేపీనెస్ అని చెప్పారు. ప్రతి ఇంట్లో గ్లాసుడు పాలను నవ్వుతూ అందించడమే తమ సంస్థ లక్ష్యమని, ఇలా చేయడం ద్వారా ప్రతి ఇంటిలో ఆరోగ్యంతో పాటు ఆనందం వెల్లివిరుస్తుందని తెలిపారు. నాణ్యతే తమ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. రోజూ 28 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నామని చెప్పుకొచ్చారు. బ్రాహ్మణి స్పీచ్‌కు పారిశ్రామికవేత్తలు చప్పట్లతో సూపర్ అంటూ అభినందనలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైపోల్‌లో గెలిచి సీఎం కుర్చీలో కూర్చోవడమే లక్ష్యం... ప్లాన్‌ను వివరించిన దినకరన్