కేటీఆర్‌తో దానం భేటీ.. రక్తపు కూడు తినననీ.. ఏ పాపం చేయనని కామెంట్
తెలంగాణ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్‌ను కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దాదాపు 20 నిమిషాల పాటు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటి స్నేహపూర్వకంగా జ
తెలంగాణ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్‌ను కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దాదాపు 20 నిమిషాల పాటు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటి స్నేహపూర్వకంగా జరిగిందని, ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని దానం చెప్పారు.
నయీమ్ దందాల వెనుక గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతగా ఉన్న దానం నాగేందర్ హస్తం కూడా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంది. నయీమ్ ఫామ్ హౌస్ పక్కనే దానం ఫామ్ హౌస్ కూడా ఉండటం, పలు సెటిల్ మెంట్లకు దానం నాగేందర్ సహకరించాడని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటి టాక్ అఫ్ ది టౌన్‌గా మారింది.
అయితే దానం నాగేందర్ కేవలం బంధువులకు చెందిన ఓ కంపెనీ విషయం మాట్లాడేందుకు వెళ్లినట్లు సమాచారం. తాను పార్టీ మారే విషయంలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారాలపై ఆయన స్పందిస్తూ తాను రక్తపుకూడు తినననీ, ఏ పాపం చేయనన్నారు. ఎలాంటి ప్రచారాలకు తాను భయపడే సమస్యేలేదన్నారు. తనకో వ్యక్తిత్వం ఉందనీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేవరకు పోరాడుతానని స్పష్టం చేశారు.