దేనికైనా మేం రె'ఢీ'... సిద్ధంగా ఉన్నాం... పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, రాష్ట్రపతిని కలిసిన మోదీ... ఏం జరుగుతుంది?
దాడులు చేయడం, మారణకాండను సృష్టించడం.. ఆ తర్వాత అది మా పని కాదని బొంకడం. ఇంకా అది చాలదన్నట్లు ఉడత ఊపులు కూడా. యూరి దాడుల నేపధ్యంలో భారతదేశం తమపై ఎలాంటి చర్యకు దిగినా దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జన
దాడులు చేయడం, మారణకాండను సృష్టించడం.. ఆ తర్వాత అది మా పని కాదని బొంకడం. ఇంకా అది చాలదన్నట్లు ఉడత ఊపులు కూడా. యూరి దాడుల నేపధ్యంలో భారతదేశం తమపై ఎలాంటి చర్యకు దిగినా దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ ప్రకటించారు. పాక్ టాప్ కమాండర్స్ తో భేటీ అయిన తర్వాత షరీఫ్ మాట్లాడుతూ... అంతా తాము గమనిస్తున్నామనీ, ప్రత్యక్ష లేదా పరోక్ష చర్యలకు వేటికైనా ధీటుగా సమాధానమిచ్చేందుకు సమాయత్తంగా ఉన్నట్లు తెలిపారు.
భారతదేశంలో దాడులు నేపధ్యంలో పాకిస్తాన్ దేశంలో అంతర్గత భద్రతపై సమీక్షించినట్లు ఆయన తెలిపారు. తమ ఆర్మీ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆర్మీ ఎందుకు సన్నద్ధంగా ఉందో... ఎవరిపైన సన్నద్ధంగా ఉందో వేరే చెప్పక్కర్లేదు. కాగా భారతదేశంలో జరిగిన దాడులను పాకిస్తాన్ దేశంపై నెట్టడం దారుణమనీ, ఆ దాడులన్నీ భారతదేశమే చేసుకుని తమపైకి నెడుతోందంటూ అక్కడి ప్రభుత్వం వాదనలు చేయడం విడ్డూరం. అంతేకాదు... అక్కడి పత్రికలు కూడా భారతదేశాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఏకాకిని చేసేందుకు భారత్ ఇలాంటి పన్నాగాలు పన్నుతోందంటూ దారుణగా రాశాయి.
ఇదిలావుంటే ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఉగ్ర దాడులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఐతే ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేముందే రాష్ట్రపతిని ప్రధానితో సమావేశం అవడం జరుగుతుంటుంది. మరి ఈసారి ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.