Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్సీ అల్టిమేటం...

Advertiesment
Congress Ex MLC
, శనివారం, 6 నవంబరు 2021 (15:21 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో సీనియర్ నేత తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిత్తుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేతమాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు కాంగ్రెస్ హైకమాండ్‌కు అల్టిమేటం జారీచేశారు. ఈయన పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. 
 
ఉత్తర తెలంగాణ ఇందిరా కాంగ్రెస్‌ పేరుతో పార్టీ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆయన అనుచరులతో సమావేశమవుతున్నారు. ఈ సమావేశం తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన నేతలతోనే కాంగ్రెస్‌ వీడుతున్నట్లు ఆయన చెబుతున్నారు.
 
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో మంచిర్యాలలో తన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పార్టీనే నమ్ముకున్న నాయకులకు అన్యాయం జరుగుతోందని ప్రేంసాగర్ రావు మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలు, నాయకులను వదిలేసి కొత్తగా వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రో ధరలను ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదు... తుగ్ల‌క్!