Publish Date: Mon, 18 Oct 2021 (15:35 IST)
Updated Date: Mon, 18 Oct 2021 (15:37 IST)
సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు. రేపు యాదాద్రి పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఉదయం 11.30కు హైదరాబాద్ నుండి బయలుదేరి వెళతారు.
యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నింటిని రేపటి పర్యటనలో మరోసారి సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు. యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామివారు నిర్ణయించి వున్నారు.
ఇక రేపు యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారు. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం కెసీఆర్ ప్రకటించనున్నారు. కాగా.. ఇప్పుడు వచ్చే డిసెంబర్ మాసంలో యాదాద్రి టెంపుల్ పునః ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.