Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెరాస నేతల కీలక సమావేశం

Advertiesment
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెరాస నేతల కీలక సమావేశం
, ఆదివారం, 17 అక్టోబరు 2021 (16:25 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై సమావేశంలో చర్చించనున్నారు. 
 
అలాగే, నవంబరు 15వ తేదీన వరంగల్‌ విజయగర్జన సభ నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పురోగతిపై సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర కమిటీలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాగా, పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా, తెరాస అధ్యక్ష పీఠానికి ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఈ పదవికి సీఎం కేసీఆర్‌ పేరును నేతలంతా బలపరుస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దత్తన్న అలయ్ బలయ్ వేడుకకు పవన్.. విష్ణును పట్టించుకోని జనసేనాని!