తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్ర పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా తాను దత్తత తీసుకున్న గ్రామ సర్పంచ్ అంజయ్యకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అందుకోసం అవసరమయ్యే నిధులు, దళితబంధు అమలు తదితరాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను రూపొందించాలని ఆయన గ్రామ సర్పంచ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దళితబంధు పథకం కింద గ్రామంలో ఎంపికైన లబ్దిదారుల ఆదాయ, వ్యయాల వివరాలను కూడా సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో అర్హులైన అందరికీ దళితబంధు అందేలా చూడాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. వారంలోగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కూడా గ్రామ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ సూచించారు.