Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజా సంగ్రామ యాత్ర కాదు దండగమాలిన యాత్ర : సీఎం కేసీఆర్

ప్రజా సంగ్రామ యాత్ర కాదు దండగమాలిన యాత్ర : సీఎం కేసీఆర్
, శుక్రవారం, 27 ఆగస్టు 2021 (17:12 IST)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న యాత్రకు ప్రజా సంగ్రామ యాత్రగా పేరును ఖరారు చేశారు. ఈ యాత్రపై ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్స్ చేశారు. అది ప్రజా సంగ్రామ యాత్ర కాదనీ దండగ మాలిన యాత్ర అంటూ సెటైర్లు వేశారు. 
 
అంతేకాకుండా, ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని కేసీఆర్ ప్రకటించారు. 
 
దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్​రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణం అని తెలిపారు. ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. 
 
ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నం. సాగు నీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నాం. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నాం. కరెంటును నిరంతరాయంగా ఇచ్చుకుంటున్నాం. ఒకనాడు కూలీ పనికి పోయిన రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకుంటున్నాం. రాష్ట్రం వచ్చిన నాడు అర్థంకాని పరిస్థితుల నుంచి అర్థవంతమైన, గుణాత్మకాభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులేస్తున్నది. ఆకలి చావుల నుంచి అన్నపూర్ణగా ఎదిగింది రాష్ట్రం అంటూ వ్యాఖ్యానించారు 
 
రైతుబంధు, రైతు బీమాతో రైతులకు వ్యవసాయానికి ఉపశమనాన్ని కలిగించినం. గత వలసపాలనలో అన్ని రంగాల్లో గాడి తప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకున్నది. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాల‌ బాధితులకు పెన్షన్ అందిస్తున్న ఒకే ఒక్క‌ రాష్ట్రం తెలంగాణ. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలను సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ ఒక దరికి చేరుకున్నాం. నేను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృధ్ది కార్యచరణకు ఇప్పుడు సమయం వచ్చిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలింతను అడవిలోనే వదలిపెట్టేసిన 102 సిబ్బంది.. నడవలేక..?