Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ డిమాండ్ - నేడు బీజేపీ మౌనదీక్షలు

రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ డిమాండ్ - నేడు బీజేపీ మౌనదీక్షలు
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (08:38 IST)
రాజ్యాంగాన్ని మార్చాలని, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు బుధవారం చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. పైగా వివాదాస్పదమయ్యాయి కూడా. 
 
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నేతలు మండపడితున్నారు. దీంతో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసంగా గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మౌనదీక్షను చేయనున్నారు. రాజ్‌ఘాట్ వద్ద నల్ల బ్యాడ్యీలు ధరించి బీజేపీ ఎంపీలు తమ నిరసనను తెలుపనున్నారు. 
 
ఇందులోభాగంగా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో పాటు బీజేపీ ఎంపీలు ఢిల్లీలో మౌనదీక్షను చేయనున్నారు. ఇందులో ఆ పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరి శ్రీరాం, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్శి బాలసుబ్రహ్మణ్యం తదితర నేతలంతా కలిసి ఈ దీక్షను చేపట్టనున్నారు. అలాగే, ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా టీకా వల్ల నా కుమార్తె ప్రాణం పోయింది.. రూ.1000 కోట్లు చెల్లించండి...