Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ పరువు తీసిన దక్కన్ హోటల్.. ఒంటరి మహిళ వస్తే రూమ్ ఇవ్వనంది

హైదరాబాద్ విశ్వనగరమట. దీన్ని ఇంగ్లీషులో చెబితే కాస్మొపొలిటన్ సిటీ అనవచ్చు. అంటే ఇది లోకల్ కాదని, అంతర్జాతీయ సంస్కృతి పరిఢవిల్లే మేటి నగరమని అర్థం. స్వేచ్ఛకు, ఆధునికతకు పట్టం గట్టే మహా నగరాలు పారదర్శకతే తమ విధానమని చాటుకుంటాయి. కానీ భారత దేశ పర్యటనకు

హైదరాబాద్ పరువు తీసిన దక్కన్ హోటల్.. ఒంటరి మహిళ వస్తే రూమ్ ఇవ్వనంది
హైదరాబాద్ , మంగళవారం, 27 జూన్ 2017 (06:02 IST)
హైదరాబాద్ విశ్వనగరమట. దీన్ని ఇంగ్లీషులో చెబితే కాస్మొపొలిటన్ సిటీ అనవచ్చు. అంటే ఇది లోకల్ కాదని, అంతర్జాతీయ సంస్కృతి పరిఢవిల్లే మేటి నగరమని  అర్థం. స్వేచ్ఛకు, ఆధునికతకు పట్టం గట్టే మహా నగరాలు పారదర్శకతే తమ విధానమని చాటుకుంటాయి. కానీ భారత దేశ పర్యటనకు వచ్చిన ఒక సింగపూర్ యువ నటికి ఈ విశ్వనగరం జీవితంలో మర్చిపోని చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ఎంతో ముందుగా ఆన్‌లైన్‌లో తన కోసం గది బుక్ చేసుకుని మరీ వస్తే సింగిల్ మహిళ అనే సాకుతో హైదరాబద్ ఎర్రగడ్డ ప్రాంతంలోని దక్కన్ హోటల్ ఆమెకు రూమ్ ఇవ్వకుండా ఘోరంగా అవమానించింది. ఆ రాత్రివేళ, చేతిలో పెద్ద లగేజితో, ప్రయాణ బడలికతో తను బుక్ చేసుకున్న హోటల్‌కి వస్తే నీకు రూమ్ ఇవ్వం పో అని యాజమాన్యం ఆమెను హోటల్ బయటే అరగంట సేపు నిలబెట్టి మరీ అవమానించింది. భారతదేశంలో లింగ వివక్షత హోటల్స్ సాక్షిగా ఎలా సాగుతోందో ఈ ఉదంతం గొప్పగా నిరూపించింది. 
 
బడలికతో, అవమానంతో ఆ సింగపూర్ యువతి ఫేస్ బుక్‌లో పెట్టిన ఏక వాక్య పోస్టింగ్ ఇప్పుడు వేలాదిమంది సానుభూతిని పంచిపెట్టడమే కాకుండా దక్కన్ హోటల్‌కి ఎవరూ వెళ్లి బస చేయవద్దంటూ పెద్ద ఆన్ లైన్ ప్రచారం సాగుతోందిప్పుడు. హోటల్ యాజమాన్యం ఆమెను అవమానించాలనే ఉద్దేశం తమకు లేదని ఎర్రగడ్డ ప్రాంతం ఒంటరిగా వచ్చే మహిళలకు క్షేమకరం కాదనే ఉద్దేశంతోనే ‘ఒంటరి మహిళల’నిబంధన అమలు చేస్తున్నాం అంటూ వివరణ ఇచ్చినా నెటిజన్ల కోపం పోలేదు.
 
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌ సింగపూర్‌కు చెందిన నటి నుపూర్‌ సారస్వత్‌ ప్రస్తుతం భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.  ఆమె శనివారం బెంగళూరు నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇక్కడకు రావడానికి ముందే ఆన్‌లైన్‌లో గోఐబిబో ద్వారా ఎర్రగడ్డలోని దక్కన్‌ హోటల్‌లో ఓ గదిని బుక్‌ చేసుకున్నారు. నగరానికి వచ్చిన నుపూర్‌ నేరుగా తన లగేజీతో ఆ హోటల్‌కు వెళ్లారు. అయితే ఆమె అవివాహితని, ఒంటరిగా వచ్చిన మహిళని తెలుసుకున్న హోటల్‌ యాజమాన్యం ‘చెక్‌ఇన్‌’కు అంగీకరించలేదు. 
 
తమ హోటల్‌ పాలసీ ప్రకారం స్థానికులు, అవివాహితులైన జంటలతో పాటు ఒంటరి మహిళలకు బస చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పింది. దీంతో ఆమె చాలాసేపు ఆ హోటల్‌ బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నటి గోఐబిబో దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ... గోఐబిబో క్షమాపణలు చెప్పింది. మరో హోటల్‌ లో బస ఏర్పాటు చేసింది. దీంతో సారస్వత్‌ దక్కన్‌ హోటల్‌ నుంచి సదరు హోటల్‌కు వెళ్లారు. 
 
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని సారస్వత్‌ తన ఫేస్‌బుక్, ట్వీటర్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజనులు దీనిపై తీవ్రంగా స్పందించారు. ఇది మహిళల పట్ల వివక్ష, వారి హక్కులను కాలరాయడమేనంటూ హోటల్‌ తీరును తప్పుపట్టారు. మరోవైపు నుపూర్‌కు జరిగిన అవమానాన్ని గోఐబిబో తీవ్రంగా పరిగణించి... తమ ఆన్‌లైన్‌ సర్వీసుల జాబితా నుంచి దక్కన్‌ హోటల్‌ను తొలగించింది. 
 
అయితే ఈ నిర్ణయాన్నీ ఫేస్‌బుక్‌ ద్వారా తప్పు బట్టిన సారస్వత్‌... తన ఉద్దేశం అది కాదని, ఇకపై ఇలాంటి ఆన్‌లైన్‌ సర్వీసు సంస్థలు తమ యాప్స్‌లో మరిన్ని ఫిల్టర్స్‌ పెట్టాలని, ఒంటరి మహిళలకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 
 
ఇంతకీ ఆమె పెట్టిన పోస్టింగ్ ఏమిటి అంటే.  
 
చేతిలో పెద్ద లగేజ్‌ బ్యాగ్‌. ప్రయాణ బడలిక. అర్ధగంట నుంచి హోటల్‌ బయట నిరీక్షణ. గది కంటే వీధులే సురక్షితమని హోటల్‌ యాజమాన్యం భావించి ఉంటుంది’
 
నిజంగానే ఈ పోస్ట్ ప్రపంచమంతటా వైరల్ అయింది. ఈ లింగ వివక్షపై నెటిజనులు తీవ్రంగా స్పందించారు. నుపూర్‌కు మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా సోషలైట్‌లు హోటల్‌ వైఖరిని తూర్పారబట్టారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో చోటు చేసుకుందీ ఘటన! 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రెండు క్షణాలు ఎంత ఆహ్లాదంగా గడిచాయంటే.. మోదీ జోక్‌తో ట్రంప్ దంపతుల ఫిదా