ఆ రెండు క్షణాలు ఎంత ఆహ్లాదంగా గడిచాయంటే.. మోదీ జోక్‌తో ట్రంప్ దంపతుల ఫిదా
భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ - మెలనియా దంపతులు కలుసుకున్న తొలి క్షణాలు ఆహ్లాదంగా సాగాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 1.10 గంటల సమయంలో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కోసం ప్రధాని మోదీ వైట్ హౌస్ చేరుకున్నారు. అప్పటికే అక్కడ
ప్రపంచంలో ఏ దేశాధినేతనూ లెక్క చేయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోదీని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అమరికాలోని భారతీయులు, దౌత్యాధికారులు కాస్త టెన్షన్ పడ్డారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించగానే జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో వంటి పాశ్చాత్య దేశాల అధినేతలనే ట్రంప్ జాడించి వదిలారు. అమెరికన్ ప్రయోజనాలను కాపాడటంతో వీరు ఏమాత్రం సహకరించడం లేదని మండిపడ్డారు ట్రంప్. చివరికి జర్మనీ ఛాన్సలల్ ఏంజెలా మెర్కెల్ వైట్ హౌస్ సందర్శిస్తే ట్రంప్ అమర్యాదకరంగా ఆమెతో వ్యవహరించారు. ఈ పరిణామాల నేపధ్యంలో అసలే అసహనంతో ఉండే ట్రంప్ మోదీతో కూడా సీరియస్‌గానే భేటీ జరపవచ్చని అంతా భావిస్తూ వచ్చారు.
కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ - మెలనియా దంపతులు కలుసుకున్న తొలి క్షణాలు ఆహ్లాదంగా సాగాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 1.10 గంటల సమయంలో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కోసం ప్రధాని మోదీ వైట్ హౌస్ చేరుకున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ట్రంప్, మెలనియా దంపతులు మోదీని సాదరంగా ఆహ్వానించి కరచాలనం చేశారు. ఆత్మీయంగా పలుకరించారు. సుమారు రెండు నిమిషాల పాటు ప్రధాన ద్వారం వద్దే క్షేమ సమాచారాలను విచారించుకున్న తర్వాత ముగ్గురూ శ్వేతసౌథంలోకి వెళ్ళారు.
ఓ రెండు నిమిషాలు పాటు ముచ్చట్లు అయిన తర్వాత మోదీ ఏం జోక్ చేశారో తెలీదు గానీ అమెరికా అధినేత ట్రంప్, మెలనియా దంపతులు హాయిగా గుండె నిండా నవ్వారు. ఇప్పుడు మోదీ వేసిన ఆ జోక్ ఏమిటయ్యుంటుందా... అని సరదా చర్చలు, వ్యంగ్యాస్త్రాలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌కు ప్రధానమంత్రి అయిన మోదీకి ట్రంప్ ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో చెప్పడానికి ఈ కొద్ది క్షణాలు చాలని అక్కడి మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.