Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ వేడుకలు ప్రారంభం

తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ వేడుకలు ప్రారంభం
, శనివారం, 14 అక్టోబరు 2023 (13:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో మహిళల అతిపెద్ద పండుగ బతుకమ్మ వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆడబిడ్డల నుంచి వృద్ధుల వరకు వీధి వాడనా బతుకమ్మ ఆటలు ఆడేందుకు సిద్ధమవుతున్నారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగే బతుకమ్మ వేడుకలతో ప్రతివీధి శోభాయమానంగా మారనుంది.
 
రామారాం ఉయ్యా, రమణే శ్రీరామ ఉయ్యా, అంటూ ఉయ్య పాటలు, తెలంగాణ జానపద గేయాలు రాష్ట్రాన్ని ఉర్రూతలూగిస్తాయి. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు మహిళలు జరుపుకునే ఈ పండుగకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. 
 
గోరింటాకు, తంగేడు, బంతి, గునుగు, తామరపువ్వులతో అందంగా అలంకరించి, స్త్రీ పురుషులందరూ ఒకే చోట చేరి సాయంత్రం వేళల్లో తొమ్మిది రోజుల పాటు పాటలు, జానపద నృత్యాలు, కోలాటాలతో అమ్మవారిని పూజిస్తారు. తొమ్మిదో రోజు పెద్ద బతుకమ్మలను పేర్చి, మహిళలంతా వాయిద్యాలు వాయిస్తూ గ్రామ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.
 
వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన పూల బతుకమ్మలను గ్రామ చెరువులో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అయితే అనాదిగా వస్తున్న ఈ ఆచారం వెనుక సైన్స్ దాగి ఉందని పెద్దలు చెబుతున్నారు. 
 
వర్షాకాలంలో వచ్చే నీటిలో మనుషులకు హాని కలిగించే సూక్ష్మజీవులు ఉంటాయన్నారు. అలాగే శరదృతువులో ప్రారంభమయ్యే శరన్నవరాత్రులలో గౌరమ్మ రూపంలో అమ్మవారిని పూజిస్తారు. అయితే పూలన్నీ శ్రీచక్ర రూపంలో పేర్చి మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మలను ఉంచి అమ్మవారి పాటలతో ప్రదక్షిణలు చేస్తారని భక్తుల విశ్వాసం. భాద్రపద అమావాస్య నుంచి ఎనిమిది రోజుల పాటు చిన్న చిన్న బ్రతుకమ్మలను పేర్చిన మహిళలు.
 
తొమ్మిదో రోజు పెద్ద బ్రతుకమ్మలను తయారు చేసి పూజించిన తర్వాత డప్పుచప్పుళ్ల మధ్య గ్రామంలోని నిర్దేశిత ప్రాంతానికి వెళతారు. ఆడవాళ్ళంతా ఒకచోట చేరి కొత్తబట్టలు, సత్తుపిండ్లు వగైరా సిద్ధం చేసుకుంటే బ్రతుకమ్మ పండుగ పూర్తవుతుంది.తొమ్మిది రోజుల పాటు ఆడవారికి జరిగే అతి పెద్ద పండుగ బ్రతుకమ్మ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంద్రధనుస్సు వర్కౌట్ అవుతుందా? కమలం మేనిఫెస్టోలో 7 ప్రధాన హామీలు