Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆవ్రా లేబొరేటరీస్ ట్రాన్స్‪లేషనల్ రిసర్చ్ కోసం సిఎస్ఐఆర్- ఎ.వి.రామా రావు ఛైర్స్ ఏర్పాటు

ఆవ్రా లేబొరేటరీస్ ట్రాన్స్‪లేషనల్ రిసర్చ్ కోసం సిఎస్ఐఆర్- ఎ.వి.రామా రావు ఛైర్స్ ఏర్పాటు
, సోమవారం, 28 సెప్టెంబరు 2020 (23:21 IST)
పద్మభూషణ్ డా. ఎ.వి.రామా రావు స్థాపించిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన అవ్రా లాబొరేటరీస్ వారు ట్రాన్స్‪లేషనల్ రిసర్చ్ రంగంలో అత్యుత్తమ కృషిని గుర్తించి, అందుకు మద్దతు నిచ్చే ఉద్దేశంతో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్(సిఎస్ఐఆర్)లో మూడు రిసర్చ్ ఛైర్స్ ఏర్పాటు చేస్తున్నారు.
 
ఈ ఛైర్‌లని వీరి గౌరవార్థం ఏర్పాటు చేసేరు. డా.ఎ.వి.రామా రావు, సిఎస్ఐఆర్-ఐఐసిటి మాజీ డైరెక్టర్, ఎంపిక చేసిన సైంటిస్ట్‌ల కృషిని గుర్తించడానికి మూడేళ్ళ పాటు ఫెలోషిప్ ఇస్తారు. ఛైర్ సెలక్షన్ కమిటీ 2020-2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ స్వీకరించడానికి ఈ క్రింద నామినీలని ఎంపిక చేసింది:
 
1. డా. ఎస్. చంద్రశేఖర్, డైరెక్టర్, సిఎస్ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్. ఫార్మా రంగంలో ట్రాన్స్‪లేషనల్ రిసర్చ్ లో అత్యుత్తమంగా కృషి చేసారు.
 
2. డా. అమోల్ ఎ. కులకర్ని, సీనియర్. ప్రిన్సిపల్ సైంటిస్ట్, సిఎస్ఐఆర్- నేషనల్ కెమికల్ లేబొరేటరీ, పూనే. ట్రాన్స్‪లేషనల్ రిసర్చ్, మైక్రో మరియు ఫ్లో రియాక్టర్లతోసహా కంటిన్యువస్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ల వ్యాపారీకరణ లో అాధారణంగా కృషి చేసారు.
 
గత 25 ఏళ్ళుగా, అధునాతన ఫార్మాసూటికల్ ఇంటర్మీడియట్లని అభివృద్ధి చేయడానికి, ప్రయోగశాల నుంచి వ్యాపారస్థాయిలో సరఫరా చేయడానికి, దేశీయ, బహుశజాతి కంపెనీలతో ఆవ్రా సన్నిహితంగా పనిచేస్తోంది. ఈ కంపెనీ పలు సంక్లిష్ట మాలికుల్స్ తయారీకోసం సరికొత్త తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే క్రమాన్ని అభివృద్ధి చేసింది. ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా వున్న ఆవ్రా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, డా. చంద్ర రామారావు మాట్లాడుతూ "సిఎస్ఐఆర్ తో కలిసి పనిచేయడం, ఎంతో కృషిచేసి, తమ ప్రయోగశాల పరిశోధనని పరిష్కారాలకి, ఉత్పత్తులకి విస్తరించిన అసాధారణ సైంటిస్ట్‌లని గౌరవించడం ఆవ్రాకి దక్కిన గౌరవం" అని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండుగ సీజన్‌ వేళ డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించిన అమెజాన్‌ ఇండియా