Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీకు పెళ్లయిందని నాకు తెలుసు... కానీ నిన్నొదలనంది... చివరికి..?

Advertiesment
నీకు పెళ్లయిందని నాకు తెలుసు... కానీ నిన్నొదలనంది... చివరికి..?
, మంగళవారం, 27 నవంబరు 2018 (19:42 IST)
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఒక ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీ అది. జనగామకు చెందిన రామ్ కుమార్ ఆ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. సరిగ్గా మూడు నెలల క్రితం వివాహమైంది. భార్యను సొంతూరులోనే తల్లిదండ్రుల వద్ద వదిలి హైదరాబాద్‌కు వచ్చి పనిచేసుకుంటున్నాడు. వారాంతంలో ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. 
 
ఎప్పటిలాగే తాను ఉంటున్న క్రిష్ణారెడ్డి నగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు బైక్ పైన బయలుదేరాడు రామ్ కుమార్. మధ్యలో ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఎవరిని లిఫ్ట్ అడుగుతుందో తెలియక అటూఇటూ చూశాడు రాంకుమార్. ఎవరూ లేకపోవడంతో తననే అనుకుని మోటార్ సైకిల్ ఆపాడు. లిప్ట్ కావాలంది ఆ అమ్మాయి. ఎక్కమన్నాడు. కొద్ది దూరం వెళ్ళాక నేను మీ బైక్ ఎక్కి 15 నిమిషాలు అవుతోంది. అయితే ఎక్కడికి వెళ్ళాలో మీరు అడగలేదు అంటూ ఆ అమ్మాయి రామ్ కుమార్‌ను ప్రశ్నించింది.
 
దీంతో బండి ఆపాడు. కోపంతో కిందకు దిగు అన్నాడు. నేను అమ్మాయికి లిఫ్ట్ ఇవ్వడమే ఇదే ఫస్ట్ టైం. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నానన్నాడు. నేను మీరు పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలోనే వేరే విభాగంలో పనిచేస్తున్నాను. మీరు ఎప్పుడూ మోటార్ సైకిల్ పైన వెళుతూ పక్కనెవరినీ పట్టించుకోకుండా మీపాటికి మీరు వెళ్ళేవారు. ఆఫీస్‌లో కూడా మీరు ఎవరినీ పట్టించుకోకుండా కష్టపడి పనిచేస్తుంటారని తెలుసుకున్నాను. అందుకే లిఫ్ట్ అడిగానని చెప్పింది ఆ అమ్మాయి.
 
దీంతో మళ్ళీ బైక్ ఎక్కమని ఆ అమ్మాయి పేరు అడిగాడు రామ్ కుమార్. విశాలాక్షి అని చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి కంపెనీ వరకు వెళ్ళాడు. ఇలా వీరి మధ్య స్నేహానికి దారి తీసింది. ఆ స్నేహం కాస్త 15 రోజులకే శారీరక సంబంధం వరకు వెళ్లింది. ఐతే అలా కలిసే ముందు తనకు పెళ్లయిందని చెప్పాడు. దానికామె... తనకు అన్నీ తెలుసుననీ, కానీ మీలాంటి మంచివాడిని వదల్లేనని చెప్పింది. అలా ఆ సంబంధం కొనసాగిస్తూ వచ్చింది విశాలాక్షి. మెల్లగా రామ్ కుమార్ ఆస్తుల గురించి ఆరా తీసింది. అతని జీతంతో పాటు బ్యాంకులో ఉన్న డబ్బులను మెల్లమెల్లగా తీసుకోవడం ప్రారంభించింది. అలా  15 లక్షల వరకు విశాలాక్షికి సమర్పించాడు రామ్ కుమార్. 
 
విశాలాక్షి మోజులో పడి భార్యను మరిచిపోయాడు. ఇంటికి వెళ్ళడం మానేశాడు. అయితే విశాలాక్షి రామ్ కుమార్‌ను డబ్బుల కోసం రోజురోజుకు వేధించడం మొదలెట్టింది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేది. దీంతో రామ్ కుమార్ విశాలాక్షిపైన కోపంతో ఊగిపోయాడు. తనపై ఉన్న ఆస్తులన్నింటినీ తనపై రాయాలని విశాలాక్షి పట్టుబట్టింది. సున్నిత మనస్కుడు కావడంతో ఏం చేయాలో రామ్ కుమార్‌కు పాలుపోలేదు. అటు కట్టుకున్న భార్యను మోసం చేసి ఉన్న ఆస్తులను విశాలాక్షికి ఇవ్వడం ఇష్టం లేక తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు విశాలాక్షిని అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ మగాడ్రా బుజ్జీ.. బండ్ల గణేష్ బ్లేడుతో మెడ కోసుకుంటానన్నాడు.. పృథ్వీ