Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

100% వ్యాక్సినేషన్‌ సాధించిన ఖమ్మంలోని ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌

100% వ్యాక్సినేషన్‌ సాధించిన ఖమ్మంలోని ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌
, మంగళవారం, 24 ఆగస్టు 2021 (18:34 IST)
కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. వేగంగా సాధారణతకు రావడానికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై దేశం ఆశలు పెట్టుకుంది. టెస్ట్‌ ప్రిపరేషన్‌ సేవలలో దేశవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) దేశవ్యాప్తంగా ఉన్న తమ 215 కేంద్రాలలో  తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కోవిడ్‌-19 టీకాలను అందిస్తుంది.
 
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణాలోని ఖమ్మంలో ఉన్న తమ శాఖలో  బోధన, బోధనేతర  సిబ్బంది మొత్తానికి కనీసం ఒక మోతాదు టీకా అయినా అందించింది. ఈ శాఖలో 14 మంది ఉద్యోగులు ఉన్నారు.
 
ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌తో పాటుగా, జాతీయ స్థాయిలో ఓ హెల్ప్‌లైన్‌ను సైతం ఏఈఎస్‌ఎల్‌ నిర్వహిస్తుంది. దీనిద్వారా వైద్య సహాయం కావాల్సిన తమ ఉద్యోగులకు మద్దతునందిస్తుంది.  అంతేకాదు, కోవిడ్‌-19తో ఎవరైనా సిబ్బంది మృత్యువాత పడితే, ఆ ఉద్యోగుల ఓ సంవత్సర జీతాన్ని వారి కుటుంబ సభ్యులకు అందిస్తామని వెల్లడించింది. అలాగే మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు వైద్య భీమాను మూడు సంవత్సరాల పాటు అందించడంతో పాటుగా వారి పిల్లల గ్రాడ్యుయేషన్‌ వరకూ సహాయం చేయనున్నట్లు కూడా వెల్లడించింది.
 
ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌, కోవిడ్‌ సహాయం గురించి  శ్రీ ఆకాష్‌ చౌదరి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆకాష్‌  ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘ఈ సంక్షోభ కాలంలో, మా బోధన, బోధనేతర సిబ్బందికి వీలైనంతగా తోడ్పాటునందించడం మా విధి. మేము ఈ టీకా కార్యక్రమాన్ని వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులకు సైతం టీకాలను అందించడం ద్వారా మహమ్మారి బారిన పడకుండా కాపాడటం  లక్ష్యంగా ప్రారంభించాం. అదే రీతిలో వారికి అవసరమైన వైద్య అవసరాలను తీర్చేందుకు సైతం కట్టుబడి ఉన్నాం.  ఈ కార్యక్రమాలు మా విద్యార్థులకు  ప్రమాద రహిత వాతావరణం సృష్టిస్తాయి...’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్ విమానం హైజాక్ అంతా ఉత్తదే?: ఇరాన్ వరకూ దొంగిలించారట...