వరంగల్‌లో బి.టెక్ పూర్తి చేసుకున్న ఒక యువతి హైదరాబాద్‌లో మూడునెలల క్రితం ఉద్యోగం కోసం వెళ్ళింది. తన స్నేహితురాలి ద్వారా ఉద్యోగం సంపాదించే పనిలో పడింది. కానీ ఉద్యోగం కాస్త దొరక్కపోవడంతో నిరాశకు గురైంది. బి.టెక్ చదివినా ఉద్యోగం దొరక్కపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్లిపోయింది.
ఈ సమయంలో తాను ఉన్న హాస్టల్‌కు పక్కనున్న ఒక ఆంటీ ఈజీ మనీ సంపాదించే ఐడియా చెప్పింది. నీ అందాన్ని ఎరగా వేయి.. డబ్బులు నీకు అలాగే వస్తాయని చెప్పింది. దీంతో ఆ యువతి నెలరోజుల పాటు ఆంటీ చెప్పినట్లే చేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్ చేస్తూ వారితో సన్నిహిత సంబంధాల్ని నెరపింది.
ఇలా నెలరోజుల్లో 5 లక్షలకు పైగా సంపాదించింది. ఆ తరువాత వరంగల్‌కు వెళ్లిపోయింది. ఇదంతా ఫిబ్రవరి నెలలో జరిగింది. ఆ తరువాత మార్చి మొదటివారంలో ఆమెకు సంబంధాలు చూసి అమెరికాలో పెళ్ళి చేశారు. వారంరోజుల పాటు వీరి సంసారం బాగానే సాగింది. అయితే పెళ్లి చేసుకున్న వ్యక్తి పోర్న్ వీడియోలు చూస్తూ తన భార్య వేరొక యువకుడితో వుండటాన్ని గమనించాడు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త భార్యను చిత్రహింసలు చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ యువతి స్వగ్రామం రావడానికి ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా విమానాశ్రయం మొత్తం మూసివేయడంతో ఆమె అక్కడే తెలిసిన వారి ఇంట్లోనే ఉంటోంది. ఒక సెల్పీ వీడియోను వరంగల్‌లోని తన కుటుంబ సభ్యులకు పంపించింది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే తాను వరంగల్‌కు వచ్చేస్తానని ఆ వీడియోలో తెలిపింది.