Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏడేళ్ళ బాలికను రేప్ చేసి చంపేశారు...

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాల జిల్లాలో కొందరు కామాంధులు పసిమొగ్గపై తమ రాక్షసత్వం ప్రదర్శించారు. ఏడేళ్ళ బాలికను కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు.

Advertiesment
ఏడేళ్ళ బాలికను రేప్ చేసి చంపేశారు...
, మంగళవారం, 5 డిశెంబరు 2017 (09:26 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాల జిల్లాలో కొందరు కామాంధులు పసిమొగ్గపై తమ రాక్షసత్వం ప్రదర్శించారు. ఏడేళ్ళ బాలికను కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. తన పుట్టిన రోజు వేడుకలకు స్నేహితులను ఆహ్వానించిన చిన్నారి రక్తపు మడుగులో విగత జీవిగా పడివుండటం ప్రతీ ఒక్కరినీ కన్నీరుపెట్టిస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అమానవీయ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన ఈర్ల రాజు - ప్రవళిక దంపతులు ఏకైక కుమార్తె ఈర్ల రేష్మ(7) గ్రామంలోని ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుంది. అయితే ఎమ్మార్పీఎస్‌ నాయకురాలు భారతక్క మృతికి సంతాప సూచకంగా గ్రామంలో ఆదివారం రాత్రి ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో డీజేలతో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సమయంలో అన్నం తింటున్న రేష్మ ర్యాలీని చూసేందుకు వీధిలోకి వెళ్లింది. 
 
అయితే, బిడ్డ ఇంట్లో లేకపోవడంతో తండ్రి గాలిస్తూ వీధిలోకి వెళ్లగా, ఎక్కడా కనిపించలేదు. రాత్రంతా బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెదికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత గ్రామ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వరి పొలాల్లోని గడ్డిలో విగత జీవిగా రేష్మ కనిపించినట్లు చెప్పారు.
 
ర్యాలీ వద్దకు చేరుకున్న రేష్మపై కన్నేసిన కామంధులు రాత్రి ఎస్సీకాలనీ సమీపంలోని వరి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లుగా గ్రామస్థులు అనుమానిస్తున్నారు. బాలికపై అత్యంత క్రూరంగా అత్యాచారంచేసి హతమార్చి ఉంటారని చెబుతున్నారు. చిన్నారి ఒంటిపై గాట్లతో పాటు దుస్తులు చిరిగి రక్తపు మరకలతో విగత జీవిగా పడి ఉండటం చూసి ప్రతీ ఒక్కరు కన్నీరు కార్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిలపై లైంగిక దాడులు... ఈ చెప్పుతో కొడితే..?