Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16 ఏళ్ల యువతితో ముసలోడి వివాహం.. సవతి తల్లి చేసిన పనికి..

Advertiesment
16 ఏళ్ల యువతితో ముసలోడి వివాహం.. సవతి తల్లి చేసిన పనికి..
, గురువారం, 31 డిశెంబరు 2020 (14:34 IST)
పాతబస్తీలో ఓ వృద్ధుడికి 16 ఏళ్ల యువతిని కట్టబెట్టారు. వివరాల్లోకి వెళితే.. ఎండీ గౌస్ అనే వ్యక్తి భార్య కొన్నాళ్ల క్రితం మృతి చెందడంతో.. మరో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు ఓ కూతురు ఉంది. ఆ అమ్మాయి వయసు ప్రస్తుతం 16 సంవత్సరాలు. అయితే సవతి తల్లి ఉన్నీషా, తండ్రి గౌస్ కలిసి ఆమెను ఓ 57 ఏళ్ల వృద్ధుడికి కట్టబెట్టారు. ఆ వృద్దుడి నుంచి రూ. 1.50 లక్షలు తీసుకుని, డిసెంబర్ 27వ తేదీన బండ్లగూడలో వివాహం జరిపించారు. ట
 
ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎండీ గౌస్ ఇంటికి చేరుకుని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివాహం చేసుకున్న వృద్ధుడు అబ్దుల్ లతీఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దందా నడుపుతున్న మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కేరళకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.200లకే గ్యాస్ సిలిండర్.. ఎక్కడ? రూ.500 క్యాష్ బ్యాక్