సమాజంలో అనేక అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే దేవుడు ఎందుకు రావడం లేదంటూ సివిల్స్ ఇంటర్వ్యూలకు హాజరైన ఓ యువతికి ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల నుంచి ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆమె ఎంతో సమయస్ఫూర్తిగా సమాధానమిచ్చి బోర్డు సభ్యులను మెప్పించారు. పైగా, సివిల్స్ సర్వీసెస్ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించి, రెండు తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో సివిల్స్ టాపర్‌గా నిలిచారు. పేరు ఇట్టబోయిన సాయి శివానీ. వరంగల్ యువతి. సివిల్స్ ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులు ఆమెకు ఓ ప్రశ్న సంధించారు. 'భగవద్గీతలో "సంభవామి యుగేయుగే" అని శ్రీకృష్ణుడు చెప్పారు కదా.. మరి ప్రస్తుత సమాజంలో ఇన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా దేవుడు ఎందుకు రావడం లేదు' అని ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సాయి శివానీ సమాధానమిస్తూ, సమాజంలో ఉన్న ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత మంచితనం ఉంటుంది. అవసరమైన వారికి సరైన సమయంలో సహాయం చేస్తే, ఆ సహాయం చేసేవారే దేవుడుతో సమానం. దేవుడు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రానక్కర్లేద. సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడుతో సమానమే అంటూ సమయస్ఫూర్తిగా సమాధానమిచ్చారు.