Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నంబరు ప్లేట్లపై తెలంగాణ స్టేట్‌(టీఎస్) బదులు తెలంగాణ(టీజీ)గా మార్పు : నేడు నిర్ణయం

registration number code

ఠాగూర్

, ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (09:55 IST)
తెలంగాణాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం మధ్యాహ్నం జరిగే మంత్రిమండలి సమావేశంలో వాహనాల నంబరు పేట్లకు సంబంధించి తెలంగాణ స్టేట్‌ (టీఎస్‌)గా ఉన్న పేరును తెలంగాణ (టీజీ)గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి, కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం అమలు జరిగితే రాష్ట్రంలో ఇకముందు జరిగే వాహనాల రిజిస్ట్రేషన్‌ టీజీ పేరుతోనే జరగనుంది. 
 
అలాగే, ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న సత్ ప్రవర్తన గల ఖైదీల విడుదల అంశం కూడా చర్చకు రానుంది. ఇప్పటికే జైళ్ల శాఖ 240 మంది సత్ ప్రవర్తన గల ఖైదీల జాబితాను సిద్ధం చేసింది. వీరిని విడుదల చేయాలంటే ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించి, జీవోను జారీ చేయాల్సి ఉంటుంది. కేబినెట్‌ భేటీలో నీటిపారుదల శాఖ శ్వేతపత్రంపై కూడా మంత్రులు చర్చించనున్నారు. జూరాల నుంచి పర్దిపూర్‌కు, పర్దిపూర్‌ నుంచి సంగంబండ దాకా నీటిని తరలిస్తుండగా 20 టీఎంసీల నీటిని కొడంగల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు నీటిని అందించడానికి వీలుగా 'నారాయణపేట - కొడంగల్‌' ఎత్తిపోతల పథకంపై మంత్రివర్గంలో చర్చించి, ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నాయని సమాచారం.
 
ఇప్పటికే ఈ పథకాన్ని చేపట్టాలని పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో సమావేశమై, నివేదించుకోగా... దీనికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. గృహ విద్యుత్తు వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తును అమలు చేసే 'గృహలక్ష్మి' పథకం విధివిధానాలపై చర్చ జరుగనుంది. ఈ పథకానికి ఏ మేరకు ఖర్చు కానుంది? అమలు చేయడానికి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి? వంటి అంశాలపై చర్చించనున్నారు. 
 
ఆదివారం సచివాలయంలోని ఆరో అంతస్తులో గల కేబినెట్‌ మీటింగ్‌ హాల్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఓట్‌–ఆన్‌–అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చించి, ఆమోదించే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయడంతో పాటు గ్రూప్‌–1 పోస్టుల పెంపు/భర్తీ, గ్యారెంటీల అమలుపైనా చర్చ జరగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలను కించపరచడం పశుప్రవర్తనతో సమానం .. వారిద్దరికి పార్టీ అండగా ఉంటుంది : రాహుల్