Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళలను కించపరచడం పశుప్రవర్తనతో సమానం .. వారిద్దరికి పార్టీ అండగా ఉంటుంది : రాహుల్

rahul in temple

ఠాగూర్

, ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (09:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతలపై ఏపీలోని అధికార వైకాపాకు చెందిన సోషల్ మీడియా గ్యాంగ్ అసభ్యంగా పోస్టులు పెట్టడం ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైఎస్ షర్మిల పుట్టలేదంటూ వైకాపా సోషల్ మీడియా మూకలు కామెంట్స్ చేసున్నాయి. అయినప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఏమాత్రం చలనం లేకుండా చిరు నవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో షర్మిల, సునీతలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలించారు. వీరిద్దరిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వీరిద్దరికీ పార్టీ మొత్తం అండగా ఉంటుందని ప్రకటించింది. 
 
మహిళలను కించపరచడం అమానుషమని, ఇది పశు ప్రవర్తనేనని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మహిళలను బెదిరించడం, అవమానించడం నీచమని, ఇది పిరికిపందల చర్య అని ఆక్షేపించారు. ఇలాంటి చర్యలు కాంగ్రెస్‌ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేవని పేర్కొన్నారు. షర్మిలకు మద్దతుగా నిలుస్తామని రాహుల్‌ స్పష్టం చేశారు. షర్మిలకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని శక్తులు వణికిపోతున్నాయని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ రోజురోజుకూ బలం పుంజుకుంటోందని చెప్పారు. షర్మిల ప్రతిష్ఠను, వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు.
 
కాగా, 'ఓటమిని ఎదుర్కోలేని పిరికివాళ్లే క్రూరత్వాన్ని ఆశ్రయిస్తారు' అంటూ కామెంట్స్ చేసిన ఆయన.. ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా షర్మిలపై సోషల్‌ మీడియాలో వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు అనుచిత పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆమె నేరుగా స్పందించకుండా ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా నిప్పులు చెరిగారు. 'ఓటమిని ఎదుర్కొనలేనివారు క్రూరత్వాన్ని ఆశ్రయించడంతో పాటు దుర్మార్గంగా కూడా ఉంటారు' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్రవరి 4 మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ కేబినెట్ మీటింగ్...