Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

రేకుల షెడ్డును ఎత్తుకెళ్లిన సుడిగాలి.. చిన్నారి మృతి

Advertiesment
Girl who was blown away by the wind died while receiving treatment

సెల్వి

, బుధవారం, 20 మార్చి 2024 (14:10 IST)
కవల పిల్లలకు రాకాసి గాలి మృత్యువుగా మారింది. సుడిగాలి ఉయ్యాలలో ఉన్న చిన్నారి సంగీతను రేకుల షెడ్డుతో సహా విసిరికొట్టింది. ఆ వేగానికి రెండు ఇండ్ల అవతల ఓ స్లాబ్‌పై పడ్డ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 
 
కవలలైన ఆ అక్కాచెల్లెళ్లు సంగీత, సీత రేకుల షెడ్డుకు ఉయ్యాల కట్టుకొని ఆడుకుంటున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజితండాలో జరిగింది.  
 
జాజితండాకు చెందిన మంజుల, మాన్సింగ్‌ దంపతులకు సంగీత, సీత అనే కవలలు ఉన్నారు. అదే తండాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సంగీత (6) ఒకటో తరగతి చదువుతుంది. 
 
తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో నాన్నమ్మతో వున్న సంగీత, సీత ఇంట్లో రేకులకు ఉయ్యాల కట్టుకుని ఆడారు. పక్కింటికి నాన్నమ్మ వెళ్లడంతో.. భారీ సుడిగాలి వచ్చింది. రేకులతోపాటు చిన్నారి సంగీత ఎగిరిపోయి రెండు ఇండ్ల తర్వాత ఉన్న స్లాబ్‌పై పడింది. 
 
గమనించిన ఇరుగుపొరుగు వారు గాయాలతో కొట్టుమిట్టాడుతున్న సంగీతను 108లో నర్సాపూర్‌ దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం చిన్నారి సంగీత మరణించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహజీవన భాగస్వామిని.. ఆమె ప్రియుడిని చంపేసిన హత్య.. కాకినాడలో జంట హత్యల కలకలం...