Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ ఎమ్మెల్సీ గుడ్‌పై!!

tera chinnappa reddy

వరుణ్

, ఆదివారం, 24 మార్చి 2024 (11:32 IST)
తెలంగాణా రాష్ట్రంలోని భారత రాష్ట్ర సమితి షాకులపై షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు పార్టీని వీడి అధికార కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోయారు. తాజాగా మరో నేత, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి షాకిచ్చారు. ఆయన బీఆర్ఎస్‌కు టాటా చెప్పేశారు. తన రాజీనామా లేఖను ఈ నెల 18వ తేదీనే పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. ఈ విషయాన్ని నల్గొండ స్థానానికి కంచర్ల కృష్ణారెడ్డిని పేరును అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ లేఖను ఆయన బహిర్గతం చేశారు. పైగా, ఈయన బీజేపీలో చేరి.. అదే నియోజకవర్గంలో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసే అవకాశం ఉంది. తన రాజకీయ భవిష్యత్‌ను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన అధికారికంగా వెల్లడించారు. 
 
చిన్నపరెడ్డి నల్గొండ స్థానాన్ని ఆశించారు. కానీ, మాజీ సీఎం కేసీఆర్ ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా కంచర్ల కృష్ణారెడ్డికి ఇచ్చారు. ఆ వెంటనే ఆయన తన రాజీనామా లేఖను బహిర్గతం చేశారు. అదేసమయంలో చిన్నపరెడ్డికి బీజేపీ నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. ఆయనకు నల్గొండ ఎంపీ స్థానాన్ని కేటాయించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని కమలం పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇపుడు ఆ స్థానాన్ని చిన్నపరెడ్డి కేటాయించి, సైదిరెడ్డికి మరో స్థానం కేటాయించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ హామీతోనే చిన్నపరెడ్డి బీజేపీ‌ను వీడినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చిన్నపరెడ్డి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‍లో కేజ్రీవాల్ అరెస్టు.. జైలు నుంచే పాలన - కీలక ఆదేశాలు జారీ!!