Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో చేపట్టే బీసీ కులగణన దేశానికే ఆదర్శం కావాలి : రాహుల్ గాంధీ

Rahul Gandhi

ఠాగూర్

, బుధవారం, 6 నవంబరు 2024 (12:55 IST)
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే బీసీ కులగణన దశానికే ఆదర్శంగా కావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ నగరంలోని బోయినపల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. కులగణన ద్వారా ఎవరి వద్ద ఎంత ఆస్తులు ఉన్నాయో తేలిపోతుందన్నారు. 
 
కులగణన చేస్తామని తాను పార్లమెంట్ సాక్షిగా చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణలో కులగణన చేపట్టడం అభినందనీయమన్నారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కులగణన చేసి... జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్లను పెంచుతామన్నారు. రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తామన్నారు. కులగణనను వ్యతిరేకించే వారు ప్రజల నుంచి వాస్తవాలను దాచాలని చూస్తున్నారని విమర్శించారు.
 
కులగణన సందర్భంగా ఏ ప్రశ్నలు అడగాలనేది సామాన్యులే నిర్ణయించాలన్నారు. ఆ ప్రశ్నలను అధికారులు నిర్ణయించకూడదన్నారు. కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగానే ఉంటాయన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే కుల వివక్ష ఉండకూడదన్నారు. కులగణనలో ఏవైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుతామని హామీ ఇచ్చారు.
 
ఇకపోతే, దేశం గురించి తాను నిజం చెబితే... దేశాన్ని విభజించడం అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. తాను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కానీ తాను నిజం చెబుతున్నానని, దేశంలో కులవ్యవస్థ, కులవివక్ష ఉందనే విషయాన్ని అంగీకరిద్దామని ఆయన వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు