Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీకి రూ. 2,500 కోట్లు చెల్లించిన తెలంగాణ.. ఎందుకు?

Advertiesment
Money

సెల్వి

, శుక్రవారం, 23 ఆగస్టు 2024 (21:59 IST)
ఇన్నర్ రింగ్ రోడ్, హుస్సేన్ సాగర్ పునరుజ్జీవనం వంటి హైదరాబాద్‌లోని ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలకు సంబంధించిన ఆర్థిక భారం ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ మధ్య వివాదాస్పదంగా మారింది. ఈ రుణాలు అవిభక్త ఆంధ్రప్రదేశ్ కాలంలో విదేశీ ఆర్థిక సంస్థల నుండి ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ (ఈఏపీ) కింద పొందబడ్డాయి. 
 
2014లో రాష్ట్ర విభజన తర్వాత, ఈ రుణాలను తిరిగి చెల్లించే బాధ్యత కొత్తగా ఏర్పడిన ఏపీ,  తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజించబడింది. ఇందులో భాగంగా ఏపీ 58శాతం, తెలంగాణ 42శాతం బాధ్యతలను భరించింది. అయితే తెలంగాణ పదేళ్లపాటు తిరిగి చెల్లింపుల్లో తన వాటాను అందించడంలో విఫలమైందని, ఇది మొత్తం భారాన్ని ఏపీ భుజాన వేసుకునేలా చేసింది. ఇది సుమారుగా రూ. 2,500 కోట్లు.
 
ఇటీవల, కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ గడువు ముగిసిన నిధులను ఇంటర్-స్టేట్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (ఐజీటీ) యంత్రాంగం ద్వారా ఏపీకి బదిలీ చేసింది. ఈ చెల్లింపు రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పరిష్కరించబడని ఆర్థిక బాధ్యతల సమస్యకు పుల్ స్టాప్ పెట్టేసింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు - రేవంత్ చర్చల వేళ వచ్చిన ప్రతిపాదనల్లో భాగంగా ఈ చెల్లింపులు జరిగాయి. ఇన్నేళ్లకు రూ.2500 కోట్లు ఏపీకి దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ సూచనతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను రాష్ట్రానికి జమ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్‌ని సందర్శించిన నోవార్టిస్ గ్లోబల్ టీమ్