Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్‌ని సందర్శించిన నోవార్టిస్ గ్లోబల్ టీమ్

image

ఐవీఆర్

, శుక్రవారం, 23 ఆగస్టు 2024 (21:44 IST)
తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ, హైదరాబాద్‌ను నోవార్టిస్ గ్లోబల్ బృందం సందర్శించింది. ఈ ప్రతినిధి బృందంలో స్విట్జర్లాండ్ నుండి గ్లోబల్ మెడికల్ ఆపరేషన్స్, గవర్నెన్స్ డైరెక్టర్ డాక్టర్ తంజా రౌచ్, సీనియర్ క్లినికల్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ బరున్ రాయ్, లీడ్ క్లినికల్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ షర్మిలా తౌడం ఉన్నారు. హైదరాబాద్‌లోని TSCS కార్యకలాపాలు, నిర్వహణతో పాటుగా సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న రోగులకు ప్రత్యేక సంరక్షణను అందించడంలో సొసైటీ ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకోవడం, అవగాహన పొందడం ఈ సందర్శన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 
 
ఈ ప్రతినిధి బృందం సికిల్ సెల్ డిసీజ్(SCD)ని నివారించే లక్ష్యంతో జరుగుతున్న పరిశోధనలకు సహకారం కోసం సంభావ్య మార్గాలను అన్వేషించింది. సికిల్ సెల్ డిసీజ్ కోసం నవజాత శిశువుల స్క్రీనింగ్‌లో సహకరించే అవకాశం గురించి చర్చలపై సైతం దృష్టి కేంద్రీకరించింది. ప్రభావిత వ్యక్తులలో అనారోగ్యం, మరణాలను తగ్గించడానికి ముందుగా గుర్తించటం, చికిత్స చేయటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ సందర్శన సికిల్ సెల్ వ్యాధికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో సంభావ్య పరిశోధన సహకారాన్ని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది.
 
TSCS ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ మాట్లాడుతూ, "నోవార్టిస్ గ్లోబల్ టీమ్‌ని మా సొసైటీకి స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నాము. మా పని పట్ల వారి ఆసక్తి, భాగస్వామ్య అవకాశాలు, మా బృందం యొక్క నైపుణ్యం, అంకితభావానికి నిదర్శనం. సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు పరిశోధన, ఫలితాలను మెరుగుపరచడంలో అర్ధవంతమైన భాగస్వామ్యానికి ఈ పర్యటన మార్గం సుగమం చేస్తుందని మేము ఆశాభావంతో ఉన్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాస్టింగ్ కౌచ్: వేధించిన నటుడి పక్కనే భార్యగా నటించాల్సి వచ్చింది, అతను ఆమెను బలంగా హత్తుకున్నాడు