తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం అర్థరాత్రి వరకు జరిగాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశాలు రాత్రి 1.30 గంటల తర్వాత కూడా కొనసాగాయి. విద్యుత్ అంశంపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదనపు విద్యుదుత్పత్తిని చేపట్టలేదని ధ్వజమెత్తారు. విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత నిష్పత్తిని 1:100కు పెంచాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనితో పాటు పలు అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చలు సాగాయి.
ఇకపోతే.. మంగళవారం శాసన సభ ప్రారంభమైంది. సభ్యులు సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మంత్రి శ్రీధర్ బాబు స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. మరో 19 పద్దులపై శాసన సభలో చర్చ జరుగుతోంది.