Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవబోతున్నాం : తమిళిసై సౌందర్ రాజన్

tamizhisai sounderrajan

వరుణ్

, మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (09:34 IST)
లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని రాష్ట్ర మాజీ గవర్నర్‌, చెన్నై (సౌత్‌) లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేసిన తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేంద్ర మంత్రులు కానున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో భాజపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి ఆమె హైదరాబాద్‌ విచ్చేశారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమై ప్రచార ప్రణాళికపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం ద్వారా రాష్ట్ర ప్రజలను మరోసారి కలిసే అవకాశం వచ్చిందన్నారు. 
 
వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. చెన్నై(సౌత్‌)లో హోరాహోరీ పోటీ సాగినా, తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రిజర్వేషన్లను తీసేసే ప్రసక్తే ఉండదన్న స్పష్టతను ఇప్పటికే భాజపా నాయకత్వం ఇచ్చిందన్నారు. 
 
దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్‌కు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కే లేదన్నారు. ఎమర్జెన్సీలో తాను కూడా బాధితురాలినే అంటూ.. అప్పట్లో తన తండ్రిని అరెస్టు చేస్తే తమ కుటుంబం ఎంతో ఇబ్బంది పడిందని చెప్పారు. కిషన్‌రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ ఇన్‌ఛార్జిగా రాష్ట్ర మాజీ గవర్నర్‌, భాజపా నాయకురాలు తమిళిసైని పార్టీ నియమించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AP Land Titling Act-2023: ఆంధ్రప్రదేశ్ ప్రజల భూములు గల్లంతేనా?