Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త రైల్వే టైంటేబుల్

Advertiesment
Indian Railways
నూతన సంవత్సరంలో రైల్వే కొత్త టైంటేబుల్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల రాకపోకల్లో చోటుచేసుకునే సమయాలతో ఈ టైంటేబుల్‌ను విడుదల చేయనున్నారు. ఈ కొత్త టైంటేబుల్ జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే శనివారం తెలిపింది. ముఖ్యంగా, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా మొత్తం 25 రైళ్లు బయలుదేరే వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. 
 
సికింద్రాబాద్ - విశాఖపట్టణం వందే భారత్ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజూ ఉదయం 5.05 గంటలకు బయలుదేరుతుంది. ఇది జనవరి ఒకటో తేదీ నుంచి ఐదు గంటలకే బయలుదేరుతుంది. అలాగే, సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ఉదయం 8.20కి బదులుగా 8.10కి, సికింద్రాబాద్ - భద్రాచలం ఎక్స్‌ప్రెస్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 5.25 బదులుగా 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. ఈ మార్పుల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో చూడొచ్చని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం చంద్రబాబు చాలా ఫీలయ్యారు : మంత్రి సత్యప్రసాద్