Publish Date: Fri, 20 Mar 2026 (12:20 IST)
Updated Date: Fri, 20 Mar 2026 (12:25 IST)
మౌలాలి- చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య, గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. మౌలాలి, చర్లపల్లి మధ్య రైలు పట్టాల సమీపంలో, సుమారు 50 నుండి 55 ఏళ్ల వయస్సు గల ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సికింద్రాబాద్ రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు.
గుర్తుతెలియని రైలు ఢీకొనడం వల్లే ఆ వ్యక్తి మరణించినట్లు ఆయన పేర్కొన్నారు. విచారణలో భాగంగా, రైలు పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలు కింద పడిపోవడం వల్లే ఆ వ్యక్తి మృతి చెందినట్లు తేలింది.
మృతి చెందిన వ్యక్తి చారలు కలిగిన పసుపు రంగు చొక్కా, కాఫీ రంగు ట్రాక్ ప్యాంట్లు ధరించి ఉన్నాడు. అతని కుడి చేతికి రాఖీ కట్టి ఉంది. అలాగే ఛాతీ కుడి వైపున ఒక పుట్టుమచ్చ ఉంది. మృతిచెందిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే, దయచేసి 8712658581 లేదా 9440083160 నంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.