చల్లని చినుకుల్లో వేడివేడిగా బజ్జీలు తిందామని వాటిని తింటూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మిర్చి బజ్జీ తింటుండగా అది గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లాలోని అయ్యవారి పల్లికి చెందిన 55 ఏళ్ల బాల్రాం శుక్రవారం రాత్రి స్థానిక హోటల్లో మిర్చి బజ్జీలు తింటున్నాడు. వేడివేడి బజ్జీలు తింటూ వుండగానే అతడికి పొరపోయింది. ఆ తర్వాత ఊపిరాడక సతమతమై క్రింద పడిపోయాడు. వెంటనే జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.