Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2028 ఎన్నికలు.. బీఆర్ఎస్ సీఎం అభ్యర్థిగా కేటీఆర్.. పాదయాత్ర కలిసొస్తుందా?

Advertiesment
KTR

సెల్వి

, సోమవారం, 4 నవంబరు 2024 (14:45 IST)
KTR
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పార్టీ కార్యకర్తల నుండి అధిక డిమాండ్‌ రావడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు ప్రణాళికలు ప్రకటించారు. దీపావళి నాడు ట్విట్టర్‌లో జరిగిన #AskKTR సెషన్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. బీఆర్ఎస్‌ని బలోపేతం చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలతో మమేకం కావడానికి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలతో మమేకమై అధికారంలోకి రావడానికి పాదయాత్ర రాజకీయ నేతలకు బాగా ఉపయోగపడింది. 2004లో వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. 2014లో చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర టీడీపీ గెలుపుకు దోహదపడింది. 2019లో జగన్ పాదయాత్ర 151 సీట్లతో ఘనవిజయం సాధించింది. 
 
ఇక తాజాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో లోకేష్ పాదయాత్ర కూడా కీలకంగా మారింది. దీంతో తెలంగాణలోనూ ఇదే సెంటిమెంట్‌ను కొనసాగించాలని కేటీఆర్ భావిస్తున్నురు. 
 
ఇందులో భాగంగా టీఆర్ఎస్‌ను గడ్డుకాలం నుంచి వెలివేయాలనుకుంటున్నారు. ఇటీవలి ఓటమి తర్వాత బీఆర్ఎస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కేటీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే భాగ్యనగరంలో మార్పు కోసం కేటీఆర్ పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఓటమి తర్వాత కేసీఆర్ ఎక్కువగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఈసారి ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి హాజరైన ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 
 
ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కోసం కేటీఆర్ క్రియాశీలకంగా వున్నారు. హరీష్‌రావు కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పాదయాత్ర బీఆర్ఎస్‌కు కలిసొస్తుందని టాక్. అలాగే 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారనే మాట ఇప్పటికే రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతికి తర్వాత గుంతలు కనిపిస్తే ఇక సస్పెండే.. పార్థసారథి