iBomma రవి కేసుకు సంబంధించి పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించగా పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇమ్మడి రవి ఓ బ్యాంక్ సహకారంతో ఏకంగా రూ. 20 కోట్లు లావాదేవీలు చేసినట్లు గుర్తించారు. మొత్తం ఈ వ్యవహారాన్ని 36 ఖాతాల ద్వారా చక్కబెట్టినట్లు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. ఐబొమ్మ రవితో పాటు అతడి అసోసియేట్ ఇద్దరూ కలిసి సర్వర్లు, వీపీఎస్ మాస్కింగ్ వంటివన్నీ చేసారు.
ఈ పని చేసినందుకు గాను నిఖిల్ అనే వ్యక్తికి రవి భారీమొత్తంలో నగదును చెల్లించినట్లు తేలింది. పైరసీతోపాటు బెట్టింగ్ యాప్‌లతో కూడా డబ్బును ఆర్జించినట్లు కనుగొన్నారు. ఐతే ఇదంతా తను ఒంటరిగా మాత్రమే చేసాననీ, ఎవరి ప్రమేయం లేదని ఐబొమ్మ రవి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.