Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

Advertiesment
tejas crash

ఠాగూర్

, సోమవారం, 24 నవంబరు 2025 (19:01 IST)
దుబాయ్ ఎయిర్ షోలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిపోగా, ఈ ప్రమాదంలో పైలెట్ నమాంశ్ స్వాల్ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా మరో కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వీడియో చాలా స్పష్టంగా ఉండడం గమనార్హం. అలాగే ప్రమాదం కూడా దీంట్లో చాలా దగ్గరగా కనిపించింది. దీన్ని ఎవరు తీశారనేది మాత్రం తెలియలేదు. ఈ వీడియో నిడివి 2:03 నిమిషాలు. ప్రమాదానికి ముందు పైలట్‌ ఎంతో సాహసోపేతంగా, ఖకచ్చితత్వంతో చేసిన విన్యాసాలు ఇందులో రికార్డయ్యాయి. చివరి క్షణాల్లో ఒక్కసారిగా కుప్పకూలిన తీరునూ ఇందులో గమనించొచ్చు. ఇది 'WL Tan's Aviation Videos (OC)' అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో అందుబాటులో ఉంది.
 
ఎయిర్‌షోను వీక్షిస్తున్న ప్రేక్షకులు విన్యాసాలను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో అనేక వీడియోలు సోషల్‌ మీడియాలో అందుబాటులోకి వచ్చాయి. కానీ, తాజాది మాత్రం భిన్నమైన కోణంలో ఉండడం గమనార్హం. పైలట్‌ నమాంశ్‌ స్వస్థలం హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్డా జిల్లాలో ఉన్న నగ్రోటా భగవాన్‌ పట్టణం. ఆయన భార్య అఫ్సానా కూడా భారత వాయుసేనలో పైలట్‌గా పనిచేస్తున్నారు. వారికి ఒక కుమార్తె. ఆదివారం స్వస్థలంలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్-హైదరాబాద్ బిజినెస్ మీట్‌లో యాక్సిస్ ఎనర్జీ రూ. 29,500 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన