పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని పది లక్షలు గుంజేసిన కిలేడీని పోలీసులు వెతుకుతున్నారు. హైదరాబాద్ కృష్ణానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణానగర్‌కు చెందిన నానీకుమార్ వివాహ సంబంధం కోసం వెతుకుతున్నారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	దూరపు చుట్టమైన తాతాజీ శ్రీనివాస్ ద్వారా మణికొండకు చెందిన గడ్డం శ్రావణితో సంబంధం కుదిరింది. కొద్దిరోజుల తర్వాత తన తల్లిదండ్రులు ఆస్పత్రిలో ఉన్నారని డబ్బు కావాలని శ్రావణి, ఆమె సోదరుడు ప్రతాప్, మధ్యవర్తి తాతాజీ పలు దఫాల్లో నానీకుమార్ నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేశారు. 
 
									
										
								
																	
	 
	ప్రస్తుతం వారి ఫోన్లు స్విచ్ఛాప్ అయిపోయాయి. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో వుంది.