Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

Advertiesment
HCCB signs an MoU with Peddapalli District Administration
భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్(హెచ్‌సిసిబి ), దాని ప్రధాన సిఎస్ఆర్ కార్యాచరణ కార్యక్రమం, ప్రాజెక్ట్ షైన్ కింద ఉమ్మడి కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంతో ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయు)పై సంతకం చేసింది. తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా కలెక్టర్- జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ కోయ శ్రీ హర్ష, ఐ.ఏ.ఎస్. మరియు హెచ్‌సిసిబి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్ఆర్) హెడ్ శ్వేతా పునీత, సీనియర్ అధికారులు, కమ్యూనిటీ వాటాదారుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
 
ఈ అవగాహన ఒప్పందం ప్రకారం, పెద్దపల్లిలో ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా సిఎస్ఆర్ కార్యక్రమాలను హెచ్‌సిసిబి ప్రణాళిక చేయటం, సహ రూపకల్పన చేయటంతో పాటుగా అమలు చేస్తుంది. ఈ కార్యక్రమాలలో భాగంగా నీటి శుద్ధి యూనిట్‌ను అందించడం, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ముత్తారం, రామగిరి, మంథని ప్రాంతాలలోని పాఠశాలలు, సమాజాలలో ఆరోగ్యం, నీటి సంరక్షణ, పారిశుధ్యం, పరిశుభ్రత(వాష్) అవగాహన సదస్సులను నిర్వహించడం వంటి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి.
 
ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా, చెరువుల సుందరీకరణ కార్యకలాపాలకు కూడా హెచ్‌సిసిబి మద్దతు ఇస్తుంది. స్థానిక నీటి మౌలిక సదుపాయాలలో ఒక శక్తివంతమైన కమ్యూనిటీ స్థలంగా దానిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అదనంగా, అర్హతగల ప్రజలు సంబంధిత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందడంలో సహాయపడటానికి నాగరిక్ సూచ్న కేంద్రాలను (ఎన్ఎస్ కె లు) విస్తరిస్తుంది. ఈ భాగస్వామ్యం స్వయం సహాయక బృందాల (ఎస్ హెచ్ జి లు) ద్వారా మహిళలకు  నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత , జీవనోపాధి అవకాశాలపై మరింత దృష్టి పెడుతుంది.
 
తెలంగాణ రాష్ట్ర  పెద్దపల్లి జిల్లా కలెక్టర్- జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ కోయ శ్రీ హర్ష, ఐఏఎస్ మాట్లాడుతూ, బలమైన పరిపాలన మరియు సామాజిక ప్రయోజనాలతో కూడిన ప్రయత్నాల ద్వారా సమ్మిళిత అభివృద్ధిని తెలంగాణ ప్రదర్శిస్తూనే ఉంది. పెద్దపల్లిలో, స్థిరమైన గ్రామీణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం, ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయడం, స్థానిక వ్యవస్థాపకతను ప్రోత్సహించటం మా ప్రాధాన్యతగా ఉంది. నీటి భద్రత, విద్య,  మహిళాధారిత అభివృద్ధిలో జిల్లా ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి, విశ్వసనీయ కార్పొరేట్ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకోవడానికి ఈ భాగస్వామ్యం మాకు సహాయపడుతుంది. ప్రాజెక్ట్ షైన్ కింద హెచ్‌సిసిబి యొక్క నిర్మాణాత్మక నిబద్ధతను మేము అభినందిస్తున్నాము. పెద్దపల్లిలోని కమ్యూనిటీలకు మద్దతు ఇచ్చే, ఈ ప్రాంతం యొక్క సమగ్ర అభివృద్ధికి దోహదపడే, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కన్వర్జెన్స్ మోడల్‌ను నిర్మించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అని అన్నారు.
 
ఈ భాగస్వామ్యం గురించి హెచ్‌సిసిబి చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్- సస్టైనబిలిటీ ఆఫీసర్ శ్రీ హిమాన్షు ప్రియదర్శి మాట్లాడుతూ, హెచ్‌సిసిబి వద్ద, బలమైన సమాజాల పునాదిపై మాత్రమే  స్థిరమైన పురోగతి నిర్మించబడిందని మేము విశ్వసిస్తున్నాము. తెలంగాణలో మా ప్రయాణంలో అంతర్భాగంగా పెద్దపల్లి ఉంది. ప్రాజెక్ట్ షైన్ ద్వారా జిల్లా పరిపాలన యంత్రాంగంతో మా లోతైన భాగస్వామ్యం ఆ బంధానికి నిదర్శనం. కీలకమైన మౌలిక సదుపాయాలు, వాష్ యాక్సెస్, మహిళా వ్యవస్థాపకత, విద్యపై దృష్టి సారించడం ద్వారా, ఈ ప్రాంతంలో  అర్థవంతమైన, సమగ్ర అభివృద్ధిని తీసుకురావాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంకు అనుగుణంగా మా ప్రయత్నాలను మేము సమలేఖనం చేస్తున్నాము అని అన్నారు. 
 
ఈ అవగాహన ఒప్పందం ద్వారా, ప్రాజెక్ట్ షైన్ కింద కమ్యూనిటీ సాధికారతకు తమ నిబద్ధతను హెచ్‌సిసిబి  పునరుద్ఘాటిస్తుంది. ప్రాజెక్ట్ షైన్ అనేది ఐదు ప్రధాన ఇతివృత్తాలపై నిర్మించబడిన సిఎస్ఆర్ కార్యక్రమం. అవి... పర్యావరణం- విపత్తు నిర్వహణ కోసం స్థిరమైన పరిష్కారాలు; వాష్ కార్యక్రమాల  ద్వారా ఆరోగ్యం & పరిశుభ్రత; మహిళా సాధికారత & జీవనోపాధి ద్వారా సమగ్ర వృద్ధి; విద్య&నైపుణ్య నిర్మాణం ద్వారా సామర్ధ్యం పెంపొందించడం మరియు మెరుగైన భవిష్యత్తు కోసం కమ్యూనిటీలను సాధికారపరచడం.
 
ఈ కార్యాచరణ కింద, దాని అమలు భాగస్వామి వై4డి  ఫౌండేషన్ సహకారంతో, హెచ్‌సిసిబి సంగారెడ్డి, వరంగల్, మెదక్ మరియు మేడ్చల్ జిల్లాలలో బహుళ సిఎస్ఆర్ ప్రాజెక్టులను నిర్వహించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికిగానూ డెలాయిట్ నిర్వహించిన హెచ్‌సిసిబి కమ్యూనిటీ భాగస్వామ్య కార్యక్రమాల ప్రభావ అంచనా అధ్యయనం ప్రకారం, కంపెనీ కార్యక్రమాలు తెలంగాణ అంతటా సుమారు 43,000 మంది వ్యక్తులపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.
 
ఇటీవలనే , తెలంగాణ ప్రభుత్వంకు చెందిన సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్)తో ఒక అవగాహన ఒప్పందంపై హెచ్‌సిసిబి సంతకం చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ మహిళా శక్తి క్యాంటీన్లతో అనుబంధించబడిన 1,000 కంటే ఎక్కువ మహిళా వ్యవస్థాపకులను శక్తివంతం చేయడానికి, ప్రాజెక్ట్ షైన్ కింద, గ్రామీణ తెలంగాణలో సమగ్ర అభివృద్ధి మరియు సమాజ సాధికారతకు మద్దతు ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?