Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దంపతులు గొడవ పడుతుండగా పసికందు ఏడవటంతో నేలకేసి కొట్టాడు..

Advertiesment

సెల్వి

, శనివారం, 20 సెప్టెంబరు 2025 (16:58 IST)
మద్యం మత్తు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం.  మద్యం మత్తులో 12 నెలల కూతురిని కసాయి తండ్రి నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో ఈ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. దంపతులు గొడవ పడుతుండగా 12నెలల పసికందు ఏడ్వడంతో.. ఆ ఏడుపు విని ఇరుగుపొరుగు వారు వస్తారనే కూతురును నేలకేసి కొట్టాడు ఆ దుర్మార్గపు తండ్రి. 
 
ఈ ఘటన తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వృద్ధుడిపై పగబట్టిన ఆవు?!! రోడ్డుపై పరిగెత్తించి కిందపడేసి... (video)